జీవితంలోని అద్భుత రుచులు

షడ్రుచులు

July 16th, 2009 at 9:48 am

పాలకూర కోడిగుడ్డు కూర

పలానా కూర అలాగే వండాలి, ఇలాగే వండాలి అనే నియమం లేదు. మాంసం, కూరగాయలు ఎన్నో రకాలుగా మన ఆహారంలో ఉపయోగిస్తున్నాము. దేనికదే విడివిడిగా కాకుండా అప్పుడప్పుడు శాకాహారం, మాంసాహారం కలిపి వండుకోవచ్చు. అలాటిదే ఈ ప్రయోగం ..

palak egg

కావలసిన వస్తువులు:

పాలకూర – 2 cups

కోడిగుడ్లు – 3

ఉల్లిపాయ – 1

కరివేపాకు – 2 రెమ్మలు

అల్లం , వెల్లుల్లి పేస్ట్ – 1 tsp

పసుపు -చిటికెడు

కారం పొడి -1 tsp

గరం మసాలా పొడి – 1/4 tsp

ఉప్పు – తగినంత

నూనె – 2 tsp

పాలకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.  ప్యాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.  పసుపు, కరివేపాకు, కారం పొడి , అల్లం , వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కొద్దిసేపు వేయించాలి. కడిగిపెట్టుకున్నా పాలకూరను వేసి , తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టాలి.  ఇందులో నీరు పోయాల్సిన పనిలేదు. కూరంతా ఉడికి నీరంతా ఇగిరిపోయాక గుడ్లు కొట్టి కలపకుండా మూతపెట్టాలి. రెండు నిమిషాల తర్వాత గుడ్డు కూడా ఉడికిపోతుంది. అది ముక్కలు కాకుండా మెల్లిగా కలిపి , గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి.  చపాతీలు, అన్నంలోకి కూడా చాలా బావుంటుంది.

Read this post in English :

Blog Widget by LinkWithin
Tags: ,
-
12
  • Sirisha
    11:45 pm on July 17th, 2009 1

    pala kura tho eppudu pappu ledha alu tho kalipi fry visugu vachi blogs choostuntey mee blog lo ee variety kanipinchindi…thanks for the receipe

    mee blog bagundhi mukyam ga telugu lo raayadam

  • జ్యోతి
    12:22 am on July 18th, 2009 2

    ధన్యవాదాలు శిరీష.. రేపు ఆదివారం ఈ కూర చెయండి మరి.. వంటిల్లు మనదైనపుడు ప్రయొగాలు చేస్తుండాలి..

  • lalita
    4:28 am on July 18th, 2009 3

    ఇదెదొ ఛూడ్డాణనికి బనెవుంది. జ్యొతిగారు, ఎది ఓసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. రంగంలొకి దూకెస్తా.

  • lalita
    4:31 am on July 18th, 2009 4

    జ్యొతిగారు, ఇక్కడ తెలుగు రాయటం కష్టం గావుంది. ఎఅదైనా వుపాయం చెప్పండీ.

  • జ్యోతి
    4:33 am on July 18th, 2009 5

    లలిత,, ఇది తినడానికి కూడా బావుంటుంది. నేను చెప్పినట్టు చేయి. ఉప్పు , కారం నీ ఇష్టం. ఆల్ ది బెస్ట్

  • జ్యోతి
    4:34 am on July 18th, 2009 6

    లలిత పైన మార్కింగ్స్ లో ఇంగ్లీష్ టిక్ పెట్టి బరహతో రాయి..

  • Vijaya Madhava
    7:51 pm on July 19th, 2009 7

    హమ్మ.. ఇన్నాల్లకి నాకు దొరికే వాటితో కూర చెప్పారు. ఇలాంటివి ఎక్కువగా వ్రాయాలని మా బ్రహ్మచారుల సంఘం తరఫున డిమాండు.

  • జ్యోతి
    8:46 am on July 20th, 2009 8

    విజయ్ ,

    తప్పకుండా ఈజీ వంటలు ఇస్తాను. ఏందుకంటే నాకు చాలా బద్ధకం. తొందరగా అయ్యే వంటలే ఇష్టపడతాను.

  • Pavani
    4:42 pm on July 20th, 2009 9

    మీ బ్లొగ్ చాలా బాగుంది. పాలకురతొ కొడి గుడ్దు కొంబినెషన్ ఇదీ మొదటి సారి చూడటం. తొందర్లొనె ట్రే చేస్టాను.
    తెలుగులొ టైప్ చెయ్యడం కొత్తగా ఉంది, But I liked it. టైమ్ ఉంటె నా బ్లొగ్ చూడండి.

  • Gayatri
    4:47 pm on July 20th, 2009 10

    జ్యొతి గారు ,
    మీ సెటై సిమప్లి సుపర్ర్ చాలా బాగున్నది.

  • జ్యోతి
    12:31 am on July 21st, 2009 11

    గాయత్రి, పావని.. థాంక్స్ ..

  • parimalam
    6:05 am on July 31st, 2009 12

    పాలకూర ఎప్పుడూ పప్పువండి భోర్ కొట్టెసింది ఈసారి ఇలా ట్రై చెస్తాను జ్యొతిగారు!

 

RSS feed for comments on this post | TrackBack URI

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

ముఖ్య గమనిక© 2009 షడ్రుచులు All Rights Reserved -- Copyright notice by Blog Copyright The images and content of http://www.shadruchulu.com/ are copyright protected and are not permitted to be used/distributed/reproduced/published/ without the prior written permission of Jyothivalaboju. All rights reserved. Use of http://www.shadruchulu.com/ images and content in violation of these terms constitutes a violation of my copyright. No hotlinking of images without my consent. To request for permission for use of photos/content from my site, contact me via email at jyothivalaboju@gmail.com Content Protected by WP-Content Protector By PcDrome.