జీవితంలోని అద్భుత రుచులు

షడ్రుచులు

October 21st, 2009 at 4:42 pm

చికెన్ నూడుల్స్

ఈరోజుల్లో పిల్లలు, పెద్దలు చాలామందికి  పిజ్జా, బర్గర్, నూడుల్స్ లాంటి జంక్ పుఢ్ కి అలవాటు పడుతున్నారు. అవి ఖరీదైనవేగాక, వాటిల్లో వాడే దినుసులు ఆరోగ్యానికి మంచిది కాదు.  ఇక నూడుల్స్ అంటే చైనీస్ రుచికోసం కొన్ని సాసులు అవి కలుపుతారు. అందుకే ఇదే నూడుల్స్ ని మన భారతీయ రుచులకు అనుగుణంగా, మనకు నచ్చిన మసాలాలతో చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో చేసిన ప్రయోగం ఇది. ఈ నూడుల్స్ చేసిన పదినిమిషాల్లోఖాళీ..:)

chicken noodles 1

కావలసిన వస్తువులు:

ఉడికించిన నూడుల్స్ – 250 gms

ఉడికించిన చికెన్ ముక్కలు – 1/2కప్పు

ఉల్లిపాయ -1 చిన్నది

పసుపు -చిటికెడు

కారంపొడి -1 tsp

గరం మసాలా పొడి -1/4 tsp

అజి – నో -మొటొ- చిటికెడు

అల్లం వెల్లుల్లి పేస్ట్ -1/2 tsp

లవంగాలు -4

యాలకులు -3

దాల్చిన -1/2 ” ముక్క

షాజీరా – 1/2 tsp

నూనె – 4 tbsp

chicken noodles 2

రెట్టింపు నీళ్లలో నూడుల్స్ ముప్పావువంతు ఉడికించి జల్లెడలోవేసి  వార్చుకోవాలి. వెంటనే చల్లని నీళ్లు పోయాలి. తరవాత అరచెంచాడు నూనె వేసి కలిపి పెడితే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. చికెన్ ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.  ఇది ఖీమాలా తీసుకుంటే అంత బాగోదు. పిండిలా ఐపోతాయి. వెడల్పాటి ప్యాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట, అజి నొ మోటొవేసి కలిసి  మరి కొద్దిసేపు వేయించాలి.  లవంగాలు, యాలకులు,దాల్చిన చెక్క, షాజీరా , కారం వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన నూడుల్స్, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.రెండు నిమిషాలు వేయించి టమాట సాస్ తో సర్వ్ చేయండి. కావాలంటే ఇందులో మీకు ఇష్టమైన క్యారట్, బీన్స్, ఉల్లితరుగు, క్యాబేజి లాంటి కూరగాయలు సన్నగా తరిగి ఉల్లిపాయలతో పాటు వేయొచ్చు. చికెన్ బదులు మటన్ ఖీమా, వేయించిన రొయ్యలతో కూడా ఈ నూడుల్స్ చేసుకోవచ్చు.

Read this post in English :

Blog Widget by LinkWithin
Tags: , , ,
-
1
  • veeran
    2:57 pm on February 17th, 2010 1

    జ్యోతి గారు – noodles చాల బాగా వచ్చాయి. మేము cheken కు బదులు vegitables వాడాము అంధరం enjoy ఛేసాము. కచోరి కూడ tra చేసాము – బాగానే వచ్చింధి. than u so much

 

RSS feed for comments on this post | TrackBack URI

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Copy Protected by Chetan's WP-CopyProtect.