జీవితంలోని అద్భుత రుచులు

షడ్రుచులు

November 9th, 2009 at 7:26 pm

బీరకాయ సెనగపప్పు కూర

బీరకాయను ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. కూరలు, పప్పులు.. అలాగే పచ్చిముక్కలు కూడా ఆరోగ్యానికి మంచిది. బీరకాయను అచ్చంగా అలాగే కాకుండా సెనగపప్పు కలిపి వండితే చాలా రుచిగా ఉంటుంది. దీనికి కాస్త మసాలాలు ఎక్కువగా కలిపితే అదిరిపోతుంది. మాంసాహారంకు తీసిపోదు.

beerakaya senagapappu

కావలసిన వస్తువులు :

బీరకాయలు – 250 gms

సెనగపప్పు – 100 gms

ఉల్లిపాయ -1

పసుపు -1/4 tsp

కారంపొడి – 1 tsp

ఉప్పు – తగినంత

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 tsp

గరం మసాలా పొడి-1/2tsp

కరివేపాకు -1 రెబ్బ

నూనె – 3 tbsp

సెనగపప్పును కడిగి నీళ్లు పోసి కనీసం అరగంట నాననివ్వాలి. బీరకాయలు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్ లో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు,అల్లంవెల్లుల్లి పేస్ట్,కారంపొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి. సెనగపప్పు నీళ్లు ఓడ్చి, ఇందులో వేసి తడి పోయేవరకు వేయించాలి. బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. ముక్కలు మగ్గినతర్వాత కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. పప్పు ఉడికి దగ్గర పడ్డాక గరం మసాలా కలిపి దింపేయాలి. సన్నగా తరిగిన కొత్తిమిర చల్లి వడ్డించాలి. ఈ కూర చపాతీలు అన్నంలో చాలా బావుంటుంది. చాలా త్వరగా ఐపోతుంది కూడా.

Read this post in English:

Blog Widget by LinkWithin
Tags: , ,
-
1
  • pallavi
    12:43 pm on May 2nd, 2010 1

    ఈ కూర చాలా బాగుంధి నెను ఒక రొజు చెసాను అంధరికి నచింధి

 

RSS feed for comments on this post | TrackBack URI

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Copy Protected by Chetan's WP-CopyProtect.