జీవితంలోని అద్భుత రుచులు

షడ్రుచులు

January 23rd, 2010 at 7:28 pm

పాలకూర,బంగాళదుంప కూర

ఎప్పుడూ పాలకూర వెరయిటీగా ఎలా వండాలా అని ఆలోచిస్తుంటాను. సరే ఈసారి టమాట లాంటివి లేకుండా బంగాళదుంప వేద్దాం అని డిసైడ్ ఐపోయా.

కావలసిన వస్తువులు :

పాలకూర – 2 కప్పులు (సన్నగా తరిగింది)

బంగాళదుంపలు – 2

ఉల్లిపాయ – 1

పసుపు – చిటికెడు

కారంపొడి – 1 tsp

ఉప్పు -తగినంత

గరం మసాలా పొడి – 1/4 tsp

కరివేపాకు – 2 రెబ్బలు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 tsp

నూనె – 3 tbsp

పాలకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేపి కారంపొడి, కరివేపాకుతో పాటు చిన్న ముక్కలుగా కట్ చేసిన బంగాళదుంపలు వేసి నిదానంగా వేయించాలి. దుంపలు సగంవేగాక పాలకూర , తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. చిన్న మంటపై ఉడికించాలి. అవసరం అనుకుంటే సగం కప్పు నీళ్లు పోయాలి.  బంగాళదుంప ముక్కలు,పాలకూ మెత్తగా ఉడికి దగ్గర పడ్డాక గరంమసాలా కలిపి దింపేయాలి. ఈ కూర అన్నంలోకి, రొట్టెలలోకి బావుంటుంది. వెజిటేరియన్ ఐనా నాన్ వెజిటేరియన్ లా ఘాటుగా ఉంటుంది.  చాలా త్వరగా కూడా తయారవుతుంది.

Read this post in English :

Blog Widget by LinkWithin
Tags: , ,
-
2
  • madhavi
    12:51 pm on January 25th, 2010 1

    చాల ఘాటుగా ఉంది. మసాల కూర – రోటి లోకి చాల బాగుంది. కొంచెము మసాల తగ్గించుకొంటె ఘాటు తగ్గుతుంది.మేము బిర్యాని లో కలిపి తినాము. చాల బాగుంధి.

  • జ్యోతి
    12:54 pm on January 25th, 2010 2

    మాధవిగారు,

    నిజమే.. గరం మసాలా కాస్త తగ్గించుకుంటే సరి. నేను చెప్పాగా . నాన్ వెజ్ లా ఉంటుంది అని..:)

 

RSS feed for comments on this post | TrackBack URI

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Copy Protected by Chetan's WP-CopyProtect.