జీవితంలోని అద్భుత రుచులు

షడ్రుచులు

March 13th, 2010 at 5:57 pm

ఓట్స్ సేమ్యా పాయసం

బ్రతకడానికే తినాలా? లేక తినడానికే బ్రతకాలా? అని ఆలోచిస్తే ఎలా ఐనా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు గల ఆహారం చాలా అవసరం.  ఓట్స్ మంచి బలవర్ధకమైన ఆహారం.


మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌, ఏంటీ ఆక్సిడెంట్స్‌ వుంటే గుండె జబ్బులు, కాన్సర్‌, చక్కెర వ్యాధి దరిచేరవు. తృణధాన్యాల వినియోగం కూడా రాను, రాను కొరవడుతుంది. అందుకే  తృణధాన్యాల ఉపయగం తప్పనిసరిగా చెయాలి.అవి గోధుమ, ధాన్యం, చోళ్లు, జొన్నలు, మొక్కజొన్నలు, ఓట్స్‌ ప్రధానమైనవి. ఓట్స్ లో విటమిన్ బి. పీచు పదార్ధం, ప్రోటీన్లు,  ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది.

కావలసిన వస్తువులు:

ఓట్స్ – 1/2  కప్పు

సేమ్యా – 1/2 కప్పు

నెయ్యి – ౩ tsp

చక్కెర -  3/4 కప్పు

యాలకుల పొడి -  1/2 tsp

జీడిపప్ప, బాదాం, కిస్మిస్ – 1/4 కప్పు

పాలు – 1/2 litre


ముందుగా  ప్యాన్ లో చెంచాడు  నెయ్యి  వేడి చేసి ఓట్స్ ని బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.. మళ్ళీ ఇంకో  చెంచాడు నెయ్యి వేడి చేసి సేమ్యాని కూడ బంగారు రంగు వచ్చేవరకు  నిదానంగా వే్యించి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ ఇంకో చెంచాడు నెయ్యి వేడి చేసి  జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకొవాలి.

పాలు వేడి చేసి ముందుగా సేమ్యా  వేసి ఉడికించాలి.  సేమ్యా ఉడుకుతుండగా ఓట్స్ వేసి మరి కొద్ది సేపు ఉడికించాలి. తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి నిమిషం సేపు ఉడికించి వేయించిన పలుకులు కలపాలి.  దింపేసి వేడిగా కాని, చల్లగా కాని సర్వ్ చేయాలి.

ఇందులో డయాబెటిస్ పేషంట్లు చక్కెర బదులు Artificial Sweetener  లేదా  తేనె వాడొచ్చు. సేమ్యా బదులు సగ్గుబియ్యం కూడా ఉపయోగించవచ్చు.

Read this post in English:

Blog Widget by LinkWithin
Tags: , , ,
-
1
  • kvsv
    3:34 pm on March 15th, 2010 1

    తినేది తప్పనిసరిగా ఆరోగ్యాన్ని ఇచ్చేది అయ్యి వుండాలి …

 

RSS feed for comments on this post | TrackBack URI

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Copy Protected by Chetan's WP-CopyProtect.