వంటకాలలో కూరలు ఎక్కువగా ఉల్లిపాయతో మొదలుపెట్టి, గరం మసాలాతో ముగిస్తారు. మాంసాహార వంటకాలకు గరం మసాలా తప్పనిసరి. ఒక్కోసారి అలాగే వేసినా, ఎక్కువగా గరంమసాలా పొడినే వాడతారు. మన వంటింటిలో తప్పనిసరిగా ఉండవలసిన గరం మసాలా ఎలా చేయాలో చూద్దామా??..

కావలసిన వస్తువులు:
ధనియాలు లేదా ధనియాల పొడి – 50 gms
లవంగాలు – 1 tbsp లేదా 10 gms
యాలకులు – 1 tbsp లేదా 10 gms
దాల్చిన చెక్క – 1″ ముక్కలు 10-15
షాజీర – 1 tbsp లేదా 10 gms
ధనియాలు కొద్దిగా వేయించాలి (పురుగు పట్టకుండా). ఈ వస్తువులన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసి జల్లించి డబ్బాలో వేసి మూతపెట్టుకోవాలి.

ఏ కూరల్లో ఐనా చిటికెడు పొడి వేస్తే ఆ రుచే వేరు.
… బజారులో దొరికే గరం మసాలాలో మిరియాలు, జాజికాయ, జాపత్రి, బిరియాని ఆకు వేస్తారు. అది ఒక విభిన్నమైన వాసన , రుచి ఇస్తుంది. నాకైతే అది నచ్చదు. ఏ కూర చేసినా ఒకే వాసన వేస్తుంది. అందుకే ఇలా సింపుల్ గా చేసుకుంటే సరి.
8:15 am on June 14th, 2009 1
ma amma gurthuku vacchindi mee post chaduvuthunte:) Oka biryani thappa meeru pettina food posts anni maa inti ni, amma vanta ni gurthuku thecchayi. Nenu garam masala amma tho cheyinchi thechukuntaanu:) accham meeru chesina vidhangaane chesthundi:) She doesn’t like store bought masala either and mom’s are always right. I will be back to your blog again and again, keep posting:)
12:00 pm on June 14th, 2009 2
ఆలాపనగారు ,
కాని అమ్మ చేసిందానికి సాటి లేదుగా..
ధన్యవాదాలు.. కాస్త ఒపిక ఉంటే మనమే ఇంట్లో అన్నీ చేసుకోవచ్చండి..
9:45 pm on June 23rd, 2009 3
జ్యొతి గారు, ధన్యవాదములు.
7:22 pm on June 28th, 2010 4
hello jyothi garu. thank you very much for introducing andhra specials. i did not know how to prepare nonveg items and preparation of garam masala. ivala news papers lo chusi mee site open chesanu. nalanti vallaku me site chala baaga use avutundi.thank you so much. tomorrow i will try onion patchadi. meerilage enno vantalu nalanti vallakosam prepare chestarani aasistunnanu. eeroju nunchi roju mee site chustanu.
7:27 pm on June 28th, 2010 5
సుధగారు, ధన్యవాదాలు. తప్పకుండా చూస్తుండండి . నేను సాధారణంగా ఎక్కువ మసాలాలు లేకుండా త్వరగా తయారుచేసుకోగల వంటకాలు రాస్తుంటాను.
5:36 pm on July 23rd, 2010 6
jyothi mam i am very happy to shadruchulu.com i suggest my wife to see every day pratically she very vanta avida
5:49 pm on July 23rd, 2010 7
jyothi garu i love your blog and your foods yammi yammi