జీవితంలోని అద్భుత రుచులు

షడ్రుచులు

July 5th, 2010 at 5:20 pm

కచోరి చాట్

చాట్ అంటే తెలీని వారుండరేమో? ఈ చాట్ వంటకాలు త్వరగా తయారుచేసుకోవచ్చు. వెరయిటీగా ఉంటాయి కూడా. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఇక బండిమీద చాట్ తినడం ఎవరికి మాత్రం నచ్చదు చెప్పండి. కచోరి గుజరాతీ వంటకం. ఇందులో స్టఫింగ్ కోసం ఎన్నో వస్తువులు ఉపయోగిస్తారు. కాని ఇవాళ ఈ కచోరితో చాట్ చేసుకుందాం. అందునా పెసర మొలకలు కలిపి ఒక బలవర్ధకమైన ఆహారం .  చాలా సులువు . ఇట్టే తయారవుతుంది.

కావలసిన వస్తువులు:

కచోరిలు – 2

పెరుగు – 1 కప్పు

పంచదార – 1 tsp

టమాట – 1

ఉల్లిపాయ – 1

పెసర మొలకలు – 1/4 కప్పు

కొత్తిమిర – సన్నగా తరిగినది

ఉడికించిన బంగాళదుంప – 1

తురిమిన క్యారట్ – 3 tbsp

ఉప్పు – తగినంత

కారం పొడి – 1/4 tsp

చాట్ మసాలా పొడి – 1/4 tsp

నిమ్మరసం – 1/2 tsp

గ్రీన్ చట్నీ – 2 tsp

స్వీట్ చట్నీ – 2 tsp

ముందుగా పెరుగులో పంచదార వేసి బాగా చిలికి ఫ్రిజ్ లో పెట్టండి. ఉడికించిన బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పుదీనా, కొత్తిమిర, పచ్చిమిరపకాయలు కలిపి గ్రీన్ చట్నీ, బెల్లం, చింతపండు పులుసు కలిపి స్వీట్ చట్నీ తయారు చేసి పెట్టుకోండి. స్వీట్ చట్నీ చేయలేకుంటే టమాట సాస్ వాడుకోవచ్చు. ఒక గిన్నెలో బంగాళదుంప ముక్కలు, సన్నగా తరిగిన టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారట్, కొత్తిమిర,  పెసర మొలకలు, ఉప్పు, కారం పొడి, చాట్ మసాలా పొడి, నిమ్మరసం వేసి బాగా కలియబెట్టాలి. కచోరీలు తీసుకుని వాటిని మధ్యలో జాగ్రత్తగా చాకుతో కట్ చేసి లోపల ఉన్న మిశ్రమాన్ని తీసివేయాలి. ఇంతకుముందు తయారుచేసుకున్న  మిశ్రమాన్ని ఇందులో నింపాలి.  ఒక ప్లేట్ లో కచోరిలు పెట్టి దానిపై పెరుగును వేయాలి. కచోరిలలోపల కూడా పెరుగు వేయాలి. ఇది కాస్త చిక్కగా ఉండాలి. దీనిపై గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేయాలి.  కావాలంటే సన్న కారప్పూస కూడా వేసుకోవచ్చు.  చాట్ మసాలా చల్లి సర్వ్ చేయండి. అంతే కచోరి చాట్ రెడీ..

Read this in English:

Blog Widget by LinkWithin
Tags: , ,
-
2
  • supriya
    10:40 am on July 17th, 2010 1

    కచొరి ఎల తయరు చెస్తరు

  • jhansi
    3:29 pm on July 17th, 2010 2

    how to make kachori?

 

RSS feed for comments on this post | TrackBack URI

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Copy Protected by Chetan's WP-CopyProtect.