సొరకాయ అంటే కొంతమందికి నచ్చదనుకుంటా.కాని ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయ జ్యూసు ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. బరువు తగ్గించుకోవడానికి ఈ రసం చాలా ఉపయోగపడుతుంది. సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బి.పి., మదుమేహ వ్యాధిగ్రస్తురకు సొరకాయ మంచి ఆహారం అని అందరూ ఒప్పుకుంటారు. మరి సొరకాయను మీ వంటింట్లోకి తెచ్చుకోండి. ఇవాళ సొరకాయ ఇగురు తయారు చేద్దాం . ఎక్కువ దినుసులు అవసరముండదు. త్వరగానే తయారుచేసుకోవచ్చు.
కావలసిన వస్తువులు:
సొరకాయ – 250 gms
ఉల్లిపాయ – 2
పచ్చిమిరపకాయలు – 6
అల్లం ,వెల్లుల్లి పేస్ట్ – 1 tsp
కరివేపాకు = 1 రెబ్బ
కొత్తిమిర - 1/4 కప్పు
పసుపు -1/4 tsp
ఉప్పు – తగినంత
ఆవాలు – చిటికెడు
జీలకర్ర – చిటికెడు
నూనె – 2 tbsp
చిక్కటి పాలు – 1/2 కప్పు
సొరకాయను చెక్కుతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను సన్నగా తరిగి ఉంచాలి. వెడల్పాటి ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర వేయాలి. అవి కాస్త చిటపటలాడాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తబడేవరకు నిదానంగా వేపాలి. ఇప్పుడు పసుపు, సన్నగా తరిగిన కొత్తిమిర, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మరి కొద్దిసేపు వేయించి సొరకాయ ముక్కలు,తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. లేత సొరకాయ ఐతే నిదానంగా ఉడికిస్తే నీళ్లు పోసే పని ఉండదు. లేదంటే అరకప్పు నీళ్లు పోసి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి. పచ్చిమిర్చి, కొత్తిమిర కలిసిన కమ్మటి వాసన వస్తుంది. చివరగా అరకప్పు చిక్కటి వేడిపాలు పొసి ఒక నిమిషం ఉడకనిచ్చి దింపేయాలి. ఈ కూర చపాతీలు, అన్నంలోకి కూడా బావుంటుంది.

3:42 am on July 14th, 2010 1
chala chala ruchi ga undi Thank you.
9:18 pm on July 16th, 2010 2
జ్యోతి గారు, చాలా బాగుంది సొరకాయ కూర.. మా నాన్నగారు చపాతీలలో ఇష్టంగా తింటారు..
మీ సైట్లో వ్యాఖ్యలు ఇలా తెలుగులో రాయటం నాకు చాలా బాగా నచ్చింది..
9:29 pm on July 21st, 2010 3
నిన్న చెసాను ఈ కూర మీరు చెప్పిన విధంగా..చాల బాగ వచ్చంది. కొంచమ్ కొబ్బరి వెసాను…Thx for this recipe
12:46 pm on August 9th, 2010 4
hai jyothigaru mi recipes chala chala bagunaye.nenu regular ga try chesthunanu.telugu lo ivvadam chala nachindi.thank so much.