వానాకాలం, చల్లని సాయంకాలం.. హాట్, హాట్ గా ఏదైనా తినాలని ఎవరికుండదు చెప్పండి. అది కూడా చాలా త్వరగా చేసుకుని వేడిగా తిని, టీ తాగితే అ మజాయే వేరు. సో ఇవాళ మైసూర్ బజ్జి చేద్దాం. అసలు ఈ మైసూర్ బజ్జికి ఆ పేరెందుకు వచ్చింది. మైసూర్ బజ్జిలో మైసూరు ఉంటుందా అని నన్నడగకండి. ఎందుకంటే నాకు తెలీదు కాబట్టి. హాయిగా చేసుకుని తినడం ముఖ్యం కాని ఈ సోదంతా ఎందుకు చెప్పండి..
కావలసిన వస్తువులు :
మైదా – 2 కప్పులు
పెరుగు – 3/4 కప్పు
వంట సోడా – చిటికెడు
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 tsp
పచ్చిమిరపకాయలు – 4
కరివేపాకు – 2 రెబ్బలు
అల్లం – చిన్న ముక్క
పచ్చి కొబ్బరి – 2 ” ముక్క
నూనె – వేయించడానికి
ముందుగా మైదాపిండి జల్లించి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, ఉప్పు, కొబ్బరిముక్కలు, వంటసోడా,జీలకర్ర, పెరుగు వేసి బాగా కలిపి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి గరిటజారుగా కలిపి ఆరగంట పక్కన పెట్టాలి. ఇందులో పులిసిన పెరుగు కాని మజ్జిగ ఉంటే రుచి ఇంకా బావుంటుంది. బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండిని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా వేయాలి. నిదానంగా బంగారురంగు వచ్చేవరకు వేయించి తీయాలి. వేడి వేడి బజ్జీలు కొబ్బరి లేదా పల్లీ పచ్చడి లేదా ఆవకాయతో సర్వ్ చేయండి. చూసారా ఎంత త్వరగా, సులువుగా మైసూరు బజ్జి రెడీ అయిందో..

8:53 pm on July 20th, 2010 1
ఇది మైసూర్ బోండా అనుకుంటాను?? కాదా? మైసూర్‌లో బజ్జీ కుడా ఉంటాయి కదా, అవీ మన బజ్జీల్లాగా కాకుండా పొడుగ్గా, అదో రిచిగా బాగుంటాయి వాటినేమంటారు
9:05 pm on July 20th, 2010 2
తారగారు,
నేనైతే వీటిని మైసూర్ బజ్జీలనే అంటాను. మైసూరులో ఏమంటారో మరి. బోండా అంటే మధ్యలో కూరపెట్టి చేసేది అని నా అభిప్రాయం..అనుభవం కూడా..
2:14 pm on July 21st, 2010 3
ఒహో,
మరి మైసూర్‌లో ఎమంటారో,
కానీ మైసూర్లో, బజ్జీ, బోండా, మీరు పైన చెప్పినది, మసాలా వడ, అన్ని ప్రయత్నించాను.
ఈ సారి కర్నాటక వెళ్ళినప్పుడు తెలుసుకోవాలి అన్నిటి పేర్లు.
7:07 pm on July 21st, 2010 4
జ్యోతి గారు,
ఆ ఫోటో పెట్టి భలె ఊరిస్తున్నారండీ. ఇవాళే చేసుకుని తినాలనిపిస్తోంది.
5:24 am on July 22nd, 2010 5
You are not allowing to take copy of the articles so that we can take printouts for later use.
thanks
5:31 am on July 22nd, 2010 6
చాలా బావుంది… కాలేజి లొ వున్నప్పుడు ఇది కంఫర్ట్ ఫుడ్ మరియు చీప్ ఫుడ్..